Kesineni Chinni: రోజా.. నోరు అదుపులో పెట్టుకో: ఎంపీ కేశినేని చిన్ని మాస్ వార్నింగ్

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏక పక్షంగా తీర్పునిచ్చినా.. సిగ్గు రాలేదా అంటూ ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni), వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-21 16:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏక పక్షంగా తీర్పునిచ్చినా.. సిగ్గు రాలేదా అంటూ ఎంపీ కేశినేని చిన్ని (MP Kesineni Chinni), వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మాట్లాడే ముందుకు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి జనం హర్షిస్తున్నారని.. తమకు వస్తున్న మంచి పేరును చూసి మాజీ సీఎం జగన్ (Former CM Jagan), మాజీ మంత్రి ఆర్కే రోజా (Former Minister Roja)కు కడుపు మంటగా ఉందని ఆరోపించారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారని, అందుకే జనం పోయిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రతపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని ఫైర్ అయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం (CM)తో పాటు డిప్యూటీ సీఎం (Deputy CM) హస్తినకు వెళ్లి అక్కడున్న కేంద్రం పెద్దలతో కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గంజాయి (Ganja)కి అడ్డాగా మార్చిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. యువతతో వైసీపీ నాయకులు (YCP Leaders) అక్రమంగా గంజాయి రవానా చేయించారని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో 30 మంది మహిళలు మాయం అయ్యారని.. ప్రస్తుతం వారిని ఆచూకీని గుర్తించి.. తిరిగి వారి సొంత ఇళ్లకు పంపేందుకు తమ ప్రభుత్వం కృష్టి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోందని, దోషులు ఎంతటి వారైనా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.  


Similar News