డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కబ్జాలకు కేరాఫ్ అడ్రస్: టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-12-13 07:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కబ్జాలకు కేర్ అఫ్ అడ్రస్ అంజాద్ బాషా అని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో లే అవుట్‌లు వేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ లే అవుట్‌లలో వేసిన ప్లాట్‌లను అమాయక ప్రజలు కోనొద్దు అని సూచించారు. అంజాద్ బాషా భూ కుంభకోణాలు బయటికి తీస్తాం అని హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నిలదీస్తున్న టీడీపీ శ్రేణులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు అని ఆరోపించారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అవినీతి చిట్టాను బయటికి తీస్తాం అని హెచ్చరించారు. 14 th ఫైనాన్స్ లో రూ.196 కోట్ల నిధులు వస్తే డిప్యూటీ సిఎం అంజాద్ బాషా ఆ నిధుల్లో 8శాతం కమిషన్ తీసుకున్నాడు అని ఆరోపించారు. అంజాద్ బాషా అవినీతిపై, భూ కబ్జాలపై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ కార్పొరేటర్లే అంజాద్ బాషా కమీషన్ వ్యవహారం బయటపెడుతున్నారని చెప్పుకొచ్చారు. కడపలో వాగులు వంకలను సైతం వదలకుండా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కబ్జాలు చేస్తున్నారని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంజాద్ బాషా కబ్జాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను జైలుకు పంపడం ఖాయం అని హెచ్చరించారు. అంతేకాదు కబ్జాలకు సహకరించిన అధికారులను సైతం వదిలే ప్రసక్తే లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు.  

Tags:    

Similar News