KA Paul: ఆనాడు చిరంజీవి అలా.. నేడు పవన్ ఇలా: కేఏ పాల్ సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల ఎన్నికల ప్రక్రియ పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల ఎన్నికల ప్రక్రియ పొలిటికల్ హీట్‌ను పుట్టిస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగబోతున్నారనే అంశంపై అన్ని పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మూడు రాజ్యసభ స్థానాలకు గాను ఇప్పటికే టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీల్లోని ముఖ్య నేతలు ఎవరికి వారుగా ఢిల్లీ (Delhi)కి వెళ్లి జోరుగా లాబీయింగ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన ఆరోపణలు చేశారు.
తన అన్న నాగబాబు (Nagababu)కు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మంతనాలు చేశారని ఆక్షేపించారు. ఆ నాడు కేంద్ర మంత్రి (Union Minister) పదవి కోసం చిరంజీవి (Chiranjeevi) పార్టీని కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో విలీనం చేశారని.. నేడు పవన్ (Pavan) కూడా బీజేపీ (BJP)తో ఆ విధంగానే వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వారికి కుటుంబ స్వార్థం తప్ప మరేదీ పట్టదని కేఎల్ పాల్ (KA Paul) ఫైర్ అయ్యారు.