బియ్యం అక్రమ రవాణాపై సచివాలయంలో మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం(PDS Rice) అక్రమార్కులు చేతుల్లోకి వెళ్తుంది.

Update: 2024-12-02 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం(PDS Rice) అక్రమార్కులు చేతుల్లోకి వెళ్తుంది. ఆ బియ్యాన్ని అక్రమార్కులు.. వివిధ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలతో పాటు.. విదేశాలకు సైతం తరలిస్తూ.. కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏకంగా.. సముద్ర మార్గంలో కూడా అధికారులతో కుమ్మక్కై కొందరు బడా నేతలు.. పేదల బియ్యాన్ని పెద్ద పెద్ద షిప్పుల ద్వారా.. స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా.. పట్టుబడ్డారు. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడటం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అమరావతిలోని సచివాలయం(Secretariat)లో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై అధికారులతో కలిసి చర్చించారు. ఏపీలో పోర్టుల నుంచి పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ఉన్నతస్థాయి సమిక్షలో మంత్రులతో పాటు విజిలెన్స్‌ డీజీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ, మారిటైమ్‌ బోర్డు సీఈవో పాల్గొన్నారు.


Similar News