Ex Minister: పవన్ కల్యాణ్‌ను అభినందించిన వైసీపీ కీలక నేత
జనసేన(Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అభినందించారు.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన(Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అభినందించారు. సోమవారం నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణాను అడ్డుకోవడం అభినందనీయమని అన్నారు. అయితే, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టెల్లాషిప్(Stellaship)ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్.. కెన్‌స్టార్ షిప్(Kenstar Ship)ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.
కెన్‌స్టార్ షిప్‌లో ఆర్థికశాఖ మంత్రి వియ్యంకుడు బియ్యం తరలిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అసలు కెన్‌స్టార్ షిప్‌లోకి వెళ్లకుండా పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారో తమకు తెలియాలని డిమాండ్ చేశారు. షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చే ఇద్దరు అధికారులు పవన్ వెంటే ఉన్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వని అధికారులు.. ఆ జిల్లా కలెక్టర్‌కు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబే కెన్‌స్టార్ షిప్‌ను వదిలేయాలని పవన్‌కు చెప్పారేమో అని అనుమానం కలుగుతోందని అన్నారు.