విశాఖలో రైతుల మహా ధర్నా.. ఉద్రిక్తత

విశాఖ కో ఆపరేటివ్ డెయిరీ గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది..

Update: 2024-12-02 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కో ఆపరేటివ్ డెయిరీ(Visakha Cooperative Dairy) గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు డిమాండ్లు వ్యక్తం చేస్తూ రైతులు మహా ధర్నా (Farmers Maha Dharna) చేపట్టారు. 12 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే డెయిరీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. సోమవారం  డెయిరీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. డెయిరీలో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. డెయిరీకి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని గుర్తించి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అటు ఆవు పాలు ధర తగ్గింపుపై మండిపడ్డారు. తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలన్నారు. అంతేకాదు ఆవు పాలు లీటర్ రూ. 50, గేదెపాలుకు రూ. 80 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది రెండు బోనస్ లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ డెయిరీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో రైతులను పోలీసులు, డెయిరీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డెయిరీ సిబ్బందికి, రైతులకు వాగ్వాదం జరిగింది. దీంతో డెయిరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News