APCC: బోట్లతో హడావిడి చేయడం కాదు.. సీబీఐ ఎంక్వైరీ వేయండి.. వైఎస్ షర్మిల డిమాండ్

రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం(PDS Rice) విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని, దీని వెనుక ప్రజా ప్రతినిధుల(Leaders) హస్తం(Hand) ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు.

Update: 2024-12-02 08:53 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం(PDS Rice) విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని, దీని వెనుక ప్రజా ప్రతినిధుల(Leaders) హస్తం(Hand) ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో గత కొద్ది బియ్యం స్మగ్లింగ్(Rice Smugling) పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల.. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని, పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడి అని తెలియజేశారు. అలాగే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని, కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని, ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని వ్యాఖ్యానించారు.

అంతేగాక గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని, ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ అని, ధాన్యాగారానికి భాండాగారమని, ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే... బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు అని, ఇది మన రాష్ట్ర దుస్థితి అని సీఎం చంద్రబాబును(CM Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ను షర్మిల ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News