వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం..గుండె తరుక్కుపోతుందంటూ కేఏ పాల్ ఎమోషనల్

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. నేడు(మంగళవారం) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Update: 2024-09-03 14:10 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. నేడు(మంగళవారం) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగ్ నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కు పోతుందన్నారు. వరదల కారణంగా ఇన్ని లక్షల మంది ఇళ్లు కోల్పోతారని అనుకోలేదని ఎమోషనల్ అయ్యారు.

దాదాపు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. కానీ వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేది కాదన్నారు. అక్రమ నిర్మాణాల వల్ల వరదలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలని, వరద బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, ఆశ్రయం అందించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.


Similar News