TG News: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్

సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు..

Update: 2024-12-13 09:36 GMT

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్‌(Movie actor Allu Arjun)ను హైదరాబాద్ చిక్కడపల్లి(Hyderabad Chikkadapally) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను కోర్టులో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. పుష్పా-2 మూవీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కినలాట జరిగి మహిళ మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.

దీంతో అల్లు అర్జున్ అరెస్ట్‌ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanti Party President KA Paul) సైతం ఖండించారు. అయితే పుష్కరాల సమయంలో ఏపీలో జరిగిన ఘటనలు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(TDP President Chandrababu) మీటింగ్‌లో జరిగిన తొక్కలాటను గుర్తు చేస్తూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని కేఏ పాల్ నిలదీశారు. 

Tags:    

Similar News