నిశితంగా గమనిస్తున్నాం.. ఏపీలోని పరిణామాలపై జేపీ నడ్డా రియాక్షన్

ఏపీలోని పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .

Update: 2023-10-13 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని పరిణామాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఏపీలోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో నడ్డాతో మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై సుజనా చౌదరిని నడ్డా ఆరా తీశారు. ఈ భేటీ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు.

ఏపీలోని పరిణామాలను వివరించేందుకు నడ్డాను కలిసినట్లు సుజనా చౌదరి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, దానికి తిప్పికొట్టాలని జేపీ నడ్డా సూచించినట్లు వివరించారు. ఏపీలోని పరిణామాలను గమనిస్తున్నట్లు నడ్డా చెప్పినట్లు సుజనా చౌదరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై నడ్డాతో చర్చించినట్లు సజనా చౌదరి చెప్పారు. కాగా బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నారా లోకేష్ కలిసిన విషయం తెలిసిందే


Similar News