TDP లో జోష్: సత్యమేవ జయతే దీక్షలకు వెల్లువెత్తిన జనం

తెలుగుదేశం పార్టీ గాంధీ జయంతి నాయుడు చేపట్టిన ‘సత్యమేవ జయతే’ నిరసన దీక్ష విజయవంతం అయ్యింది.

Update: 2023-10-02 12:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ గాంధీ జయంతి నాయుడు చేపట్టిన ‘సత్యమేవ జయతే’ నిరసన దీక్ష విజయవంతం అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించడాన్ని నిరసిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు సత్యమేవ జయతే దీక్షలను చేపట్టింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షకు దిగారు. హైదరాబాద్‌లో నందమూరి ఫ్యామిలీ సైతం ఆందోళనకు దిగింది. ఈ దీక్షలకు టీడీపీ కార్యకర్తల నుంచి భారీ స్పందన లభించింది. టీడీపీ ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అన్ని దీక్షా శిబిరాల వద్దకు అన్ని రంగాల ప్రజలు తరలివచ్చారు. ఇకపోతే రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షకు జనం పోటెత్తారు. అన్ని వర్గాల నుంచి తరలివచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. జనసేన నేతలు సైతం దీక్షలో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా సత్యాగ్రహ దీక్షకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. మెుత్తానికి సత్యమేవ జయతే దీక్షలు విజయవంతంగా ముగియడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

వాడవాడలా సత్యమేవ జయతే దీక్షలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన అక్రమ అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు సత్యమేవ జయతే పేరుతో దీక్షకు దిగారు. స్నేహ బ్లాక్‌లోనే చంద్రబాబు నాయుడు దీక్షకు పూనుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఢిల్లీ వేదికగా సత్యాగ్రహదీక్షకు దిగారు. ఆయనకు మద్ధతుగా ఆ పార్టీ ఎంపీలు దీక్షలో కూర్చుకున్నారు. న్యాయం గెలవాలని... చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు.న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందని వెల్లడించారు. మరోవైపు రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్‌లో నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్షలకు దిగారు. ఆమె చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో సత్యమేవ జయతే దీక్షలు జరిగాయి. అలాగే ప్రతీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్‌లోనూ సత్యమేవ జయతే దీక్షలను నియోజకవర్గ ఇన్‌చార్జిలు చేపట్టారు. దీక్ష శిబిరాల వద్దకు కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తమ సంఘీభావం ప్రకటించారు.

ఉప్పెనలా తరలివచ్చిన జనం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చేస్తున్న దీక్షకు సమాంతరంగా దీక్షలు చేపట్టేందుకు క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. అనుకున్నట్లుగానే దీక్షలు చేపట్టి టీడీపీకి ఉన్న బలాన్ని, సత్తాని చూపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు ఇంత పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలిరాలేదు. కానీ ఈ సత్యమేవ జయతే దీక్షలకు మాత్రం తరలివచ్చారు. అందులోనూ ఎన్నికల సమయానికి ప్రజాబలం అధికం కావడంతో టీడీపీలో జోష్ నెలకొంది. ఈ బలం వచ్చే ఎన్నికల్లో గెలుపునకు సంకేతం అని టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ ప్రతీ ఒక్కరినీ కదిలించిందని కాబట్టి ప్రతీ ఒక్కరూ తరలివచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ మద్దతు మరింత పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది.


ట్విట్టర్‌లో 4వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #BhuvanammaDeeksha అనే యాష్ టాగ్ 

ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా 4వ స్థానంలో #BhuvanammaDeeksha అనే యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేస్తున్న శాంతి యుత దీక్షకు మద్దతుగా ట్విట్టర్ వేదికగా #BhuvanammaDeeksha అనే యాష్ టాగ్ తో వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి : రైతుల త్యాగాలు వృథా కావు...అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: Nara Bhuvaneshwari

Tags:    

Similar News