Hot Politics: ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్.. జోగి రమేష్‌ రీకౌంటర్

వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పులు పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాయి.

Update: 2024-01-21 07:29 GMT

దిశ వెబ్ డెస్క్: వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పులు పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాయి. పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్థసారథిని పక్కన పెట్టి పెనమలూరు ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ని నియమించింది వైసీపీ అధిష్టానం. దీనితో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే పార్ధసారథి వైసీపీ కి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కాలనే నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నిర్ణయం తీసుకున్న తరువాత తొలిసారిగా నిన్న వైసీపీ పై విమర్శల జల్లు కురిపించారు. అయితే మాటకు మాట అన్నట్లు పార్ధసారథి సంచలన వ్యాఖ్యలకు జోగి రమేష్ ఘాటుగా స్పందిస్తూ ధీటైన కౌంటర్ ఇచ్చారు.

తేమ శాతం పేరుతో రైతులను మోసం చేస్తున్నారని  ఆరోపించిన ఎమ్మెల్యే పార్ధసారథి.. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే తాము కొంటామని ఎద్దేవ చేశారు. పార్ధసారథి నిన్నటి వరకు తమతోనే ఉన్నాడని.. నేటికీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడని.. వైసీపీ తో విభేదాలు రానప్పుడు ఈ మాట చెప్పి ఉంటె బావుండేదని కానీ ఈ రోజు విబేధాల నేపథ్యంలో విమర్శిస్తున్నారంటే లోపం ప్రభుత్వం లో ఉందా లేక ఆయనలో ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు అంటే ఆయన కూడా అదే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుచేసుకోవాలి అన్నారు.

పెనమలూరు టికెట్ ఇచ్చివుంటే అప్పుడు ఇదే విధంగా విమర్శించేవారా..? అలా ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేనే అయితే 5 సంవత్సరాల నుండి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశించారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం వైసీపీ అని.. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎన్ని చేసిన ప్రజలు నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే తనకు హైదరాబాద్ లో ఏ వ్యాపారాలు, కాంట్రాక్ట్ లు లేవు అని పేర్కొన్న ఆయన.. ఇక పై తాను అక్కడే ఉంటానని .. పెనమలూరులో ఆఫీసు కూడా తెరుస్తున్నాను వెల్లడించారు. 

Tags:    

Similar News