YSRCP: జోగి రమేశ్‌కు బిగ్ షాక్.. మరో నేతకు పెనమలూరు బాధ్యతలు

వరుస కేసుల నేపథ్యంలో జోగి రమేశ్‌ను పెనమలూరు బాధ్యతల నుంచి తొలగించారు..

Update: 2024-08-28 13:56 GMT

దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ భూముల వివాదంతో మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో  జోగి రమేశ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పెనమలూరు నియోజకవర్గంలో మార్పులు, చేర్పులు చేసింది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేశ్.. టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆయన కొనసాగుతున్నారు.

అయితే కేసుల ఎఫెక్ట్‌తో ఆయనను పెనమలూరు బాధ్యతల నుంచి తప్పించారు. పెనమలూరు వైసీపీ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తికి బాధ్యతలు అప్పగించారు. జోగి రమేశ్‌ను మైలవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.



Tags:    

Similar News