రంభల రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్ అంటూ మంత్రి అంబటికి కౌంటర్ ట్వీట్స్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు విరుచుకుపడ్డారు. అంబటి ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Update: 2022-08-16 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు విరుచుకుపడ్డారు. అంబటి ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జనసేన పార్టీ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లేదా.. అని ఇండిపెండెన్స్‌ రోజున ప్రకటించాలని అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌కు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వ్యంగంగా స్పందించారు. ''అలాగే రంభల రాంబాబు గారు. మా సార్ త్వరలోనే సమాధానం చెబుతారంటూ'' కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.

ఇక జనసేనా పార్టీ నేత నాగబాబు సైతం రాంబాబు ట్వీట్‌పై స్పందించారు. ''ఎన్ని సార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా? బాబు.. ఓ రాంబాబు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి, వైసీపీ సర్కస్‌లో నీ లాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు లేదు.. మా ప్రెసిడెంట్ గారికి అంతకన్న లేదు'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.Janasena leaders fire on Minister Ambati Rambabu

Tags:    

Similar News