ఆ రాతలు రాస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్

కూటమిపై నెగిటివ్ వార్తలు రాస్తున్న ఓ పత్రికలపై జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

Update: 2024-06-13 16:33 GMT
ఆ రాతలు రాస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కూటమిపై నెగిటివ్ వార్తలు రాస్తున్న ఓ పత్రికలపై జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామని ఆయన హెచ్చరించారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి స్పిరిట్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ‘‘వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు. ఇంకా బతికే ఉంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి. కూటమికి‌ సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను ఎవరు రాసినా, స్ప్రెడ్ చేసినా ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం...జాగ్రత్త.’’ అని నాగబాబు హెచ్చరించారు. 

Read More...

‘ఇక మొదలైంది’.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 


Similar News