Delhi: అమిత్ షాను కలిసిన పవన్.. ప్రధానంగా చర్చించిన అంశం ఇదే..

Update: 2023-10-25 14:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రెండు పార్టీలు ఇక్కడ కూడా కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరి మధ్య చర్చలు సాగాయి. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లో పొత్తులో పోటీ చేసే అంశంపై చర్చించారు. పొత్తు, సీట్ల పంపకాలు, ఏఏ స్థానాల్లో పోటీపైనా సుధీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం అమిత్ షా నివాసం నుంచి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. ఇక వీరిద్దరి భేటీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. 

ఇక పోతే పవన్ కల్యాణ్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని సమాచారం. మరికొంత మంది బీజేపీ ఆగ్రనేతలతోనూ చర్చించి సీట్ల పంపకంపై మరింత క్లారిటీ తీసుకుంటారని తెలుస్తోంది.  ఇక తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో తెలంగాణలో అన్ని పార్టీలు అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తున్నాయి. బీజేపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని యోచించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర నేతలతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో అధికారం ఖాయమంటున్న బీజేపీకి జనసేనతో పొత్తు ఎంతవరకూ కలిసివస్తుందో చూడాలి.


Tags:    

Similar News