Janasena: జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ సందేశం

ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో ఇప్పటి నుంచే రాజకీయం వేడెక్కింది...

Update: 2023-04-24 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో ఇప్పటి నుంచే రాజకీయం వేడెక్కింది.  జనసేన పార్టీ పొత్తులపై రకరకాలు ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ ఓ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందని, ఆయన సొంతంగాఎన్నికలకు వెళ్లడంలేడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో జనసైనికులు గందరగోళానికి గురవుతున్నాయి.

దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసైనికులకు బహిరంగ లేఖ రాశారు. పొత్తులపై సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఆధారంగా జనసైనికులు ఎక్కడా మాట్లాడొద్దన్నారు.  పొత్తులు పెట్టుకోవాల్సిన వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘చిన్న చిన్న నాయకులు జనసేనను విమర్శిస్తే అది వ్యక్తిగతానికి వదిలేయండి.. కానీ ఆ పార్టీలకు ఆపాదించొద్దు. ఆర్థిక నేరాలపై మీడియాలో వచ్చిందని నిర్ధారణ కావొద్దు. అసలు విషయాలు తెలిసే వరకు అసలు స్పందించొద్దు. ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాలపై మాట్లాడాల్సి వస్తే జనసేన రాజకీయా కమిటీ దృష్ణికి తీసుకురావాలి.’ అని జనసైనికులకు పవన్ కల్యాణ్ మెసేజ్ చేశారు.

Tags:    

Similar News