సమన్వయంతో పని చేద్దాం... పాలనలోకి వద్దాం: Pawan Kalyan

క్షేత్ర స్థాయి నుంచీ సమన్వయంతో పని చేద్దామని, పాలనలోకి వద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

Update: 2023-12-08 11:51 GMT

దిశ,వెబ్ డెస్క్: క్షేత్ర స్థాయి నుంచీ సమన్వయంతో పని చేద్దామని, పాలనలోకి వద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ నగర, విశాఖ రూరల్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. వైసీపీ పాలకులు, నాయకుల వేధింపులతో సతమతమవ్వని వర్గం ఏదీ లేదని పవన్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు, కష్టంలో ఉన్నప్పుడుడు స్పందించిన విధానం కచ్చితంగా జనసేనను నిలబెట్టాయన్నారు.


తెలుగుదేశంతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఉన్న సమయం కేవలం మూడు నెలలు మాత్రమేనని చెప్పారు. ఓటర్ల జాబితా, కొత్త ఓటర్ల నమోదు నుంచి ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ తీసుకువెళ్లడంలో ప్రణాళికగా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఒంటరిగా పోటీ చేస్తే మెరుగైన సీట్లు దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాపక్షం వహించాలంటే పొత్తు ద్వారా అడుగులు వేయాల్సిందేననని స్పష్టం చేశారు. అందుకే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. భాగస్వామ్య పక్షంతో గౌరవం ఇచ్చిపుచ్చుకుందామని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. 

Tags:    

Similar News