సంక్రాంతికి జనసేన-టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల

ఏపీలో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు.

Update: 2023-12-26 11:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే తెలుగుదేశం,జనసేన పార్టీలు ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లే తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల పాటు సర్వే చేయించిన పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్షలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి టీడీపీ, జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దశల వారీగా అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలు మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపిక ఇరు పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఇప్పటికే టికెట్ల సర్ధుబాటుపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి 38 నుంచి 50 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి టికెట్ ఇవ్వాలి అనేదానిపై అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కల్యాణ్‌లు కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది.

కాకినాడకు పవన్ కల్యాణ్

తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను దశల వారీగా విడుదల చేసేందుకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇకపోతే రెండో విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. గోదావరి జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇరు పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో కాకినాడలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై పవన్ కల్యాణ్ సమీక్షించనున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నారా లోకేశ్ ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపైనా పవన్ కల్యాణ్ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి వంటి అంశాలపై పవన్ కల్యాణ్ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News