Janasena Party : ఆ నియోజకవర్గ టికెట్ పై కన్నేసిన జనసేన ??
గిద్దలూరు టికెట్ పై ఇటు టీడీపీ అటు జనసేన నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు నిమగ్నమై పోయారు. శనివారం చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో గిద్దలూరు టీడీపీ ఇంఛార్జి అశోక్ రెడ్డి పేరు ఉంటుందని అందరూ భావించినప్పటికీ
దిశ, ప్రతినిధి: గిద్దలూరు టికెట్ పై ఇటు టీడీపీ అటు జనసేన నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు నిమగ్నమై పోయారు. శనివారం చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో గిద్దలూరు టీడీపీ ఇంఛార్జి అశోక్ రెడ్డి పేరు ఉంటుందని అందరూ భావించినప్పటికీ, గిద్దలూరు నియోజకవర్గ క్యాడర్ అశోక్ రెడ్డి పేరు ప్రకటించక పోవడం తో టిడిపి క్యాడర్ పూర్తి సందిగ్ధం లో పడిపోయింది. జనసేన నాయకులు మాత్రం పూర్తిగా తమ నాయకుడు ఆమంచి స్వాములు కి గిద్దలూరు టీడీపీ ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తమ నాయకుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు వారి క్యాడర్ ను సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గం లో ఇప్పుడు ఎవరి నోట విన్న గిద్దలూరు టికెట్ టీడీపీ కి ఇస్తారా లేదా జనసేన కైవసం చేసుకుంటుందాని చర్చ సాగుతోంది.
టీడీపీ కి గిద్దలూరు లో గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసి గెలిచినా సందర్భాలు చాలా తక్కువ. 2000 సంవత్సరం ఎన్నికల్లో పిడతల సాయి కల్పనా టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థులు ఓటమి చవిచూశారు. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు టికెట్ టీడీపీ కి ఇచ్చే ఆలోచనలో లేనట్టు నియోజకవర్గంలో రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరో వైపు జనసేనాని గిద్దలూరు టికెట్ పై పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు సైతం గిద్దలూరు ప్రాంతం గతంలో అన్న పార్టీ అభ్యర్థి 2009 లో ఇక్కడ విజయం సాధించడం కంభం ,బెస్తవారిపేట ,అర్ధవీడు 3 మండలాలు బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం తో గిద్దలూరు టికెట్ జనసేన కు కేటాయించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్రస్తావన తీసుకొని వచ్చి ఉంటారని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. గిద్దలూరు టికెట్ జనసేన కు కేటాయిస్తే విజయం తప్పక తమకే దక్కుతుంది అని వారి అభిప్రాయం. గిద్దలూరు టికెట్ పై నియోజకవర్గం లో వాడి వేడి గా చర్చ జరుగుతుంది .దీంతో గిద్దలూరు టికెట్ పై జనసేన పూర్తిగా కన్నేసినట్టు సమాచారం.