కోరి తెచ్చుకున్న కష్టాల్లో సూపర్ సక్సెస్.. ఆదర్శంగా పవన్ కల్యాణ్ ప్రస్థానం

పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఒక వర్గం యువత ఊగిపోతుంది. ఆయన సినిమా విడుదల ఉందంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తలపించేలా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటారు.

Update: 2024-06-12 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు ఒక వర్గం యువత ఊగిపోతుంది. ఆయన సినిమా విడుదల ఉందంటే చాలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తలపించేలా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటారు. దాదాపు పదేళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానంలో కొనసాగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత 2014 మార్చి 14న రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే 2014 లో వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేసి స్వయంగా పవన్ కల్యాణే రెండుచోట్లా ఓడిపోయాడు. జనసేన తరపున ఒకే ఒక్క రాజోలు నియోజకవర్గంలో గెలుపొందారు. అనంతరం ఐదేళ్ల పాటు జనాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు.

అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరకు మొన్న(2024) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేశారు. భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం ఘనత సాధించారు. పోటీ చేసిన అన్ని(21) స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకొని వందశాతం సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ సహా అనేకమంది ప్రముఖులు హాజరుఅయ్యారు. మరోవైపు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.

తన అభిమానులు “పవర్ స్టార్"గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం. తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మొదలైన సినిమాలతో మంచి సక్సెస్ సాధించారు. గబ్బర్ సింగ్ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై పవన్ సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.


Similar News