AP Elections 2024:ప్రతిపక్షాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య విమర్శల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా అసంబ్లీ లో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ఆరోపించారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక ప్రజాసంక్షేమం కోసమే పాటుబడిందని తెలిపారు.
ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా బాధ్యతతో ఖర్చుపెడుతూ హ్యూమన్ కాపిటల్ పైన పెట్టుబడిగా పెట్టండం జరిగిందని తెలిపారు. ఇక గడిచిన 5 సంవత్సరాలలో ప్రజలకు చెడుచేసినట్లు, మంచి చెయ్యనట్లు, అలానే మానిఫెస్ట్ లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చెయ్యనట్లు ప్రతి పక్ష పార్టీలు నమ్మితే అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరం ఏముందని ప్రశించారు.
ఇక జాతీయ పార్టీలతో కూడా ప్రతిపక్షం పొత్తు కలుపుకుంటుందని..ప్రత్యక్షంగా ఒకరితో పరోక్షంగా ఒకరితో పొత్తు కలుపుకుని పరువు నిలుపుకోవాలని ప్రతిపక్షం చూస్తోందని ఆరోపించారు. అలానే ప్రతిపక్షం వెంట పలు పార్టీలు, మీడియా సంస్థలు ఉన్నాయని.. తాను మాత్రం ఒకడినే.. అర్జునుడిలా పోరాడుతున్నాని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ పలు రాకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ప్రతిపక్షానికి మీడియా సంస్థలు అండగా నిలిస్తే.. గౌరవ ముఖ్యమంత్రికి సొంత మీడియా ఉందికదా అని కామెంట్ చేశారు. మరొకరు కాబోయే సీఎం జగన్ అని కామెంట్ చేసారు.
Read More..
కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటేనే ఏపీకి మంచిది: సీఎం జగన్