వీటికి ఎక్కడ సమాధానం చెబుతావు జగన్..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవ్వాళ రాప్తాడులో సభ ఏర్పాటు చేశాడు

Update: 2024-02-18 11:58 GMT
వీటికి ఎక్కడ సమాధానం చెబుతావు జగన్..?
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవ్వాళ రాప్తాడులో సభ ఏర్పాటు చేశాడు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై ట్వట్టర్ వేదికగా స్పందించారు. ఈ రాప్తాడు సభ నేపద్యంలో వైఎస్ జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, సమాధానం చెప్పి సభ పెడతావా.. లేక సభలో సమాధానం చెపుతావా..? అంటూ.. రాప్తాడు అడుగుతోంది.... జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని?. అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని?. అలాగే సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని? వీటికి సమాధానం చెప్పు జగన్ అంటూ.. సీఎం జగన్ ను ట్యాగ్ చేశారు. అంతేగాక వీటికి సంబందించిన ఓ ఎవిడెన్స్ ఫోటో జత చేశారు.

Similar News