జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో చంద్రబాబుకు అర్థమైనట్లుందే: మంత్రి అంబటి రాంబాబు
సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉంటుందని తాను భావిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు అర్థమై ఉంటుందని తాను భావిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డే తనను ఏం చేయలేదు.. ఆయన కొడుకు వైఎస్ జగన్ ఏం చేస్తాడు.. బచ్చా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేవారు. గుంటూరులో బుధవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏం చేస్తారో జగన్ చంద్రబాబు చూపించారన్నారని హెచ్చరించారు. జగన్ దెబ్బకు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
లోకేశ్ ఎంట్రీతో టీడీపీకి భ్రష్టుపట్టింది
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైనా మంత్రి అంబటి ఘాటు వ్యాక్యలు చేశారు. భయమంటే ఏంటో జగన్‌కు చూపిస్తానని నారా లోకేశ్ వార్నింగ్‌లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జైల్లో ఉన్న మీ నాన్నను అడిగి తెలుసుకో అంటూ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ పచ్చగా కళకళలాడుతూ ఉండేదని అలాంటి పార్టీ లోకేశ్ ఎంట్రీతో భ్రష్టుపట్టిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా కూడ గెలవని లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని...లోకేశ్ అనాలోచిత నిర్ణయాల ఫలితమే నేడు టీడీపీ పాలిట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలిట శాపంగా మారిందన్నారు. మరోవైపు 17ఏ సెక్షన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారే తప్ప తాను ఏ తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.