32 మంది పనితీరుపై Jagan సీరియస్.. ఆ విషయంలో వార్నింగ్

ఏపీ సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడపగడపకు మన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

Update: 2022-12-16 08:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడపగడపకు మన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 32 నేతల పనితీరు బాగా లేదని జగన్ నివేదిక ఇచ్చారు. మార్చిలోగా పని తీరు మార్చుకోవాలని నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. మార్చి తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలపై నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశ్యం లేదని పని తీరు మార్చుకోకుంటే మాత్రం చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. ప్రతిపక్షాల యాక్టివిటీ పెరుగుతున్న దృష్ట్యా గడపగడపకు మన కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని జగన్ ఎమ్మె్ల్యేలు, మంత్రులకు సూచించారు. తదుపరి మీటింగ్ మార్చిలో ఉంటుందని అప్పటి వరకు మార్పు కనిపించాలని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక ఎమ్మ్యెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. కాగా 32 మందిలో మంత్రులు కూడా ఉన్నట్లు తెలిసింది.

Also Read....

1.ఏప్రిల్ వరకు డెడ్ లైన్.. 32 మంది ఎమ్మెల్యేలకు CM జగన్ సీరియస్ వార్నింగ్

2.ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌కు పయ్యావుల Keshav లేఖ 

Tags:    

Similar News