‘ఆ నిధులను జగన్ మళ్లించారు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో పాలకొల్లు మండలం గోరింటాడ తదితర గ్రామాల్లో నేడు (సోమవారం) ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాలకొల్లు మండలం గోరింటాడ తదితర గ్రామాల్లో నేడు (సోమవారం) ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి(Minister of Water Resources) నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. పంచాయతీ నిధులను మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) దారి మళ్లించారని ఆరోపించారు. వైఎస్ జగన్ నిధులను దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని మంత్రి నిమ్మల(Minister Nimmala) అన్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీయే కూటమి సర్కార్‌తోనే సాధ్యమవుతుంది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే రోజు 13,326 పంచాయతీ గ్రామ సభలు, అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం చరిత్రాత్మకం అన్నారు. పల్లె పండుగలో రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతున్నామని, సంక్రాంతి లోపు గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్‌లు భిక్షాటన చేసేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.