కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది: చంద్రబాబు తరఫు న్యాయవాది ఆసక్తికర ట్వీట్

ఏపీలో సంచలనం సృష్టించిన స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-13 09:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో సంచలనం సృష్టించిన స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు రిమాండ్ పిటిషన్ కొట్టివేయాలంటూ సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబును విడుదల చేయాలని వాదనలు వినిపించారు. కానీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పోనీ చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌లోనైనా సక్సెస్ అవుతారని అంతా భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో సిద్ధార్థ లూథ్రా తీవ్ర నిరాసకు లోనైనట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం చంద్రబాబు నాయుడుకు సంబంధించి మూడు కేసుల్లో హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మూడు కేసుల్లోనూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అయితే కస్టడీ విషయంలో చంద్రబాబుకు మాత్రం స్వల్ప ఊరట లభించింది. ఇలాంటి తరుణంలో సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు...కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను లూథ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. ఈరోజు ఇదే మా నినాదం అంటూ లూథ్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మీరే గెలుస్తారంటూ నెటిజన్లు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

More News : చంద్రబాబుని పట్టించుకోని ఎన్టీఆర్.. టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే.. పాలిటిక్స్‌లో వైరల్ అవుతున్న ట్వీట్

Tags:    

Similar News