పొన్నవోలు ఏఏజీనా లేక జగన్ ఇంట్లో పాలేరా?: బొండా ఉమా

సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-11-23 09:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలసొమ్మ జీతంగా తీసుకుంటూ, జగన్ రెడ్డికి ఊడిగంచేస్తూ వ్యవస్థల్ని, పాలనా ప్రమాణాల్ని దిగజారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై వైసీపీప్రభుత్వం మోపిన తప్పుడుకేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో ఆధారాలు చూపించలేక.. బిక్కముఖం వేసిన ప్రబుద్ధులు సిగ్గులేకుండా మీడియాతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ బొండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం బొండా ఉమా మీడియాతో మాట్లాడారు.‘జగన్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్షనేతలు... ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వం తరుపున న్యాయస్థానాల్లో వాదించే సుధాకర్ రెడ్డి లాంటి న్యాయవాదులు బరితెగించి మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నాం.. బాధ్యతతో వ్యవహరించాలనే కనీసం ఇంగితజ్ఞానం విస్మరించి, న్యాయస్థానాల్ని ... న్యాయమూర్తుల్ని తప్పుపడుతున్నారు. సంజయ్... పొన్నవోలు లాంటి వారు పరిధిదాటి మాట్లాడటం అనేది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే చూస్తున్నాం. తాడేపల్లి ఆదేశాలు..కట్టుకథల తో సీఐడీ చీఫ్ సంజయ్ ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడితే, ఆ కేసుల వాదనకోసం పొన్నవోలు తన నిర్దేశకత్వంలో ఢిల్లీ నుంచి వేలకోట్లు ఇచ్చిమరీ లాయర్లను పిలిపించి న్యాయస్థానాల్లో అడ్డంగా వాదనలు వినిపించడం చేస్తున్నాడు. సంజయ్ ...సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా... జగన్ రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూమ్‌లు కడగొచ్చు

చంద్రబాబుపై తొలుత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి అని సీఐడీ తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపంది. ఆ కేసుకు సంబంధించిన వాదనల బాధ్యతను పొన్నవోలు తన భుజాలపై వేసుకున్నాడు. మొత్తంగా ఈ ప్రభుత్వం రూ.3వేలకోట్ల అవినీతి జరిగిందని అసత్యప్రచారంచేసింది. చివరకు రోజురోజుకీ దిగజారి రూ.27కోట్ల సొమ్ము తెలుగుదేశం ఖాతాలకు వచ్చిందని పొన్నవోలు న్యాయస్థానాల్లో దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. సుధాకర్ రెడ్డి ఏఏజీగా పనిచేస్తున్నాడా..లేక జగన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఏఏజీ స్థానంలో ఉండి న్యాయస్థానాల్ని గౌరవించకుండా.. న్యాయమూర్తుల్ని గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? జగన్ రెడ్డిపై సుధాకర్ రెడ్డికి అంత వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూమ్‌లు కడగొచ్చు. అంతేగానీ న్యాయస్థానాల్ని దూషిస్తూ నోరుపారేసుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు అని బొండా ఉమా హెచ్చరించారు.

పొన్నవోలు అసమర్థుడు

‘జగన్ రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని రూ.43వేలకోట్లు కొట్టేశాడని సీబీఐ, ఈడీలు నిగ్గుతేల్చాయి... అదీ ప్రివెంటిఫ్ ఆఫ్ కరప్షన్ కేసు అంటే. జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు తప్పుడు కేసు’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. చంద్రబాబు తప్పుచేశాడనే దుష్ప్రచారం తప్ప.. నాలుగున్నరేళ్లైనా జగన్ రెడ్డి ఒక్క ఆధారం కూడా ప్రజలు...న్యాయస్థానాల ముందు ఉంచలేకపోయారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టినట్టే న్యాయస్థానాలిచ్చే తీర్పుల్ని కూడా పొన్నవోలు... జగన్ రెడ్డే నిర్ణయిస్తారా? న్యాయవ్యవస్థని కూడా బ్లాక్ మెయిల్ చేసి తనగుప్పెట్లో పెట్టుకోవాలన్నదే జగన్ కుతంత్రమా అని బొండా ఉమా నిలదీశారు. చంద్రబాబు అవినీతి చేసినట్టు.. తెలుగుదేశం ఖాతాల్లోకి ఇతర మార్గాల్లో నిధులు వచ్చినట్టు పొన్నవోలు న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించలేకపోయాడు? అని ప్రశ్నించారు. కేవలం తన రాజకీయ కక్ష సాధింపులకోసమే జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను అణచివేయ డానికి.. ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేస్తూ, పొన్నవోలు లాంటి అసమర్థుల్ని.. ఢిల్లీలో కొందరు న్యాయవాదుల్ని పెంచి పోషిస్తున్నాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.

Tags:    

Similar News