ఏపీలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు ఆమోదం

ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2024-12-30 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (coalition government) అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను.. క్లీన్ ఎనర్జీ పాలసీ(Clean Energy Policy)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు గాను.. అనేక పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇదే విషయాన్ని నేడు సచివాలయంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశం(SIPB meeting)లో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలో..రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వాటిపై చర్చించి ఆమోదం(Approved) తెలిపారు. కాగా ఈ పెట్టుబడులతో.. త్వరలో రాష్ట్రంలోని 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు తెలిపారు.


Similar News