డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ.. వాదనలు ఇలా!

ఎస్‌జీటీ పోస్టులకు గాను బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Update: 2024-02-19 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌జీటీ పోస్టులకు గాను బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్ విద్యార్థులను అనుతించడం సుప్రీం కోర్టు నియమ, నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఒకే వే బీఎడ్‌ అభ్యర్థులను పరీక్షలకు అనుమతిస్తే.. సుమారు 10 లక్షల మంది డీఎడ్‌ అభ్యర్థులకు నష్టం చేసిన వారు అవుతారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని పిటినర్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 

Read More..

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ. 50 లక్షలు టోకరా 

Tags:    

Similar News