అమానుషం: ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన దుస్థితి

ఏపీలో వరుస అమానుష ఘటనలు జరుగుతున్నాయి.

Update: 2023-10-23 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో వరుస అమానుష ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే అంబులెన్స్ లేకపోవడంతో కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తల్లిదండ్రులు తీసుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరరోకటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం కొండపడకు చెందిన కిముడు అద్దన్న పొలంలో పనిచేస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అద్దన్న మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ ఇవ్వాలని కోరారు. అయితే లేదని సిబ్బంది చెప్పారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు వారు ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఫోన్ చేసినా అంబులెన్స్ లేదని సమాధానమిచ్చారు. దీంతో అంబులెన్స్ లేకపోవడంతో మృతదేహాన్ని బంధువులు భుజాలపై మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. వరుస ఘటనలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 108 అంబులెన్స్‌ల వ్యవస్థను అట్టహాసంగా ప్రారంభించారని కానీ వాస్తవంగా అంత డొల్లతనమే కనిపిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. అంబులెన్స్‌లు లేకపోవడం అంటే ఏపీ ఆరోగ్యశాఖ నిద్రావస్థలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఆరోగ్య శాఖ అధఇకారులు పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు. అంబులెన్స్‌లు సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల వలే మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్లపైనే గర్భిణీలు ప్రసవం అవుతున్న పరిస్థితి నెలకొందని ప్రజలు మండిపడుతున్నారు.


Similar News