గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద గాల్లోనే చక్కర్లు కొడుతోన్న ఇండిగో ఫ్లైట్

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ప్రతికూల వాతావరణ నెలకొంది. వెదర్ అనుకూలించకపోవడం విమానాల ల్యాండింగ్‌‌కు సమస్యగా

Update: 2024-06-18 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ప్రతికూల వాతావరణం నెలకొంది. వెదర్ అనుకూలించకపోవడం విమానాల ల్యాండింగ్‌‌కు సమస్యగా మారింది. ల్యాండింగ్‌కు ఎయిర్ పోర్టు నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హైదరాబాద్- విజయవాడ ఇండిగో ఫ్లైట్ గన్నవరం ఎయిర్ పోర్టు వద్దే చక్కర్లు కొడుతోంది. దాదాపు అరగంట నుండి ఇండిగో ఫ్లైట్ గాల్లోనే తిరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు. వెదర్ ప్రాబ్లమ్ వల్ల ల్యాండింగ్‌లో ఆలస్యం అవుతుందని అధికారులు ప్రయాణికులకు తెలియజేశారు. నైరుతి రుతు పపనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షం కురుస్తుండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. దీని ప్రభావంతోనే విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించడం లేదు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read More..

తప్పు చేస్తే TDP నేతలైనా సరే వదిలేదే లేదు హోం మిని  స్టర్ వంగలపూడి అనిత వార్నింగ్


Similar News