2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంది: Chandrababu Naidu
ప్రపంచ వ్యాప్తంగా నివశిస్తున్న భారతీయులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా నివశిస్తున్న భారతీయులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శతాబ్ధం ఇండియాదిగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘భారత దేశం 77 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్య్ర భారతం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అసమానతలు తొలగించి, పేదరికం రూపుమాపి తిరుగులేనిశక్తిగా భారత్ ను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన విజన్ తో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు దేశ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.