సొంత ఇలాకాలో: తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Update: 2023-10-23 09:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టేందుకు ప్రతీ జనసైనికుడు కలిసి పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన ప్రయత్నిస్తోందన్నారు. తెనాలి చినరావూరు పార్కు రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయాన్ని నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా జనసేన పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో పార్టీ కార్యాలయాన్ని తెనాలిలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెనాలి రాజకీయాల్లో నూతనవోరవడి సృష్టిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం-జనసేన పార్టీల కూటమి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకూ జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సంఘం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన నారాయణ కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ. 5 లక్షలు చెక్కును పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అందజేశారు.

Tags:    

Similar News