టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై అక్రమ కేసులు దారుణం: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదు చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు.

Update: 2023-12-22 07:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదు చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక చర్యలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారు అని ఆరోపించారు. చిన్న సంఘటనను అడ్డుపెట్టుకుని బ్రహ్మారెడ్డి దుర్భాషలాడినట్లు కథనాలు అల్లారని మండిపడ్డారు. జగన్ రెడ్డి కట్టుకథలకు ఫుల్ స్టాప్ పడేరోజు దగ్గర్లోనే ఉంది అని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా, టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓటమిని ఎవరూ ఆపలేరన్న విషయాన్ని గుర్తించాలి అని సూచించారు. జూలకంటి బ్రహ్మారెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News