దమ్ముంటే నన్ను, నా పూజలు ఆపండి : విశాఖలో సర్కార్‌కు అఘోరీ చాలెంజ్

తెలంగాణలో తన వ్యవహరశైలితో హల్ చల్ చేసిన మహిళా అఘోరీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తు తనదైన శైలీలో వార్తల్లో నిలుస్తున్నారు.

Update: 2024-11-05 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ :  తెలంగాణలో తన వ్యవహరశైలితో హల్ చల్ చేసిన మహిళా అఘోరీ(Aghori ) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పర్యటిస్తు తనదైన శైలీలో వార్తల్లో నిలుస్తున్నారు. విశాఖ సమీపంలోని జోడుగుళ్లపాలెం నాగ క్షేత్రంలో లింగాభిషేక పూజల్లో పాల్గొని భక్తులను దీవించారు. ఈ సందర్భంగా అఘోరీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో హిందు మతం.. సనాతన ధర్మం ప్రమాదంలో పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో మా అఘోరాలు, నాగ సాధువులు సనాతన ధర్మ రక్షణకు, లోక కల్యాణం కోసం జనాల్లోకి రావాల్సివచ్చిందన్నారు. హిందువుల కోసం, ధర్మం కోసం ప్రశ్నించే వారిని కేసులు, జైళ్లతో అణిచి వేస్తున్నారని ఆరోపించారు. అఘోరాలు, నాగసాధువులంటే స్మశానాలు, హిమాలయాలు కాదని, ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు మా వంతు కర్తవ్యం మేం నిర్వహించక తప్పదన్నారు.

ప్రభుత్వాలకు దమ్ముంటే నన్ను, నా పూజలు ఆపండని సవాల్ చేశారు. కేసులు, జైళ్లతో ప్రశ్ని్ంచే వారిని అణిచి వేస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మ పరిరక్షణకు నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. నేను కుంభమేళకు వెళ్తానని, కావాలంటే ట్రాక్ చేసుకోండన్నారు. హిమాలయాలకు వెళ్లినా మళ్ళీ తిరిగి వస్తానని, లోక కళ్యాణం జరిగే వరకూ వెనక్కి వెళ్ళేది లేదన్నారు. త్వరలో నేనేంటో చూపిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానన్నారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిన అఘోరి అనకాపల్లిలోని నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర అఘోరీ నానా హంగామా చేసింది. టోల్‌ప్లాజా సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

Tags:    

Similar News