CM Chandrababu:అమరావతిలో భూమి కొనుగోలు చేశాను.. త్వరలోనే శంకుస్థాపన
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటీ స్థలం కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) మీడియాతో మాట్లాడారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాజధాని అమరావతి ప్రాంతంలో ఇంటీ స్థలం కొనుగోలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు వెలగపూడి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 25వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉంది. దీనికి నాలుగు వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జిల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్‌జీఓల రెసిడెన్సీలు ఈ ప్లాట్‌కు సమీపంలోనే ఉన్నాయి. అలాగే రాజధానికి కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్కనుంచే వెళ్తుంది. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం వినియోగించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు గత పదేళ్లుగా కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథిగృహంలో ఉంటున్న విషయం తెలిసిందే...
Also Read:
CM Chandrababu:‘గన్ను పెట్టి వాటాలు లాక్కుంటారా?’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు