Tirumala News:తిరుమలకు వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Update: 2024-09-06 14:18 GMT

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల లడ్డులు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ లడ్డూలు అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. ఇదే ఆసరాగా తీసుకుని దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక దళారులకు అడ్డుకట్ట వేసేందుకు భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో రూ.50కి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాన్ని విక్రయిస్తారు. ఇప్పటి వరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి.


Similar News