శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ పేలుడు

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ పేలుడు(Huge explosion) శబ్దం వినిపించడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు(panic) గురయ్యారు.

Update: 2024-09-04 06:25 GMT

దిశ,వెబ్‌డెస్క్:శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు(Huge explosion) సంభవించింది. 7వ నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరిగిందో అర్థం కాక ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. అసలే జలాశయానికి వరద ఉధృతి అధికంగా ఉండడంతో ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు. దీంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు(panic) గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని(Power generation) నిలిపివేశారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌కు అధికారులు మరమ్మతు పనులు‌ చేస్తున్నారు. అయితే ఈ పేలుడు శబ్దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News