నంద్యాల మహానంది ఆలయానికి భారీ విరాళం

నంద్యాలలోని ప్రసిద్ధ మహానంది ఆలయాని(Mahanandi Temple)కి ఓ భక్తుడు భారీ విరాళం(Huge donation) అందించాడు

Update: 2024-10-25 09:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాలలోని ప్రసిద్ధ మహానంది ఆలయాని(Mahanandi Temple)కి ఓ భక్తుడు భారీ విరాళం(Huge donation) అందించాడు. రిటైర్డ్ లెక్చరర్ రాజు(Retired Lecturer Raju) గోపవరం గ్రామంలో ఉన్న తన రెండు కోట్ల విలువైన 2 ఎకరాల10 సెంట్ల భూమి, 5సెంట్ల ఇంటిని దేవాలయానికి రాసి ఇచ్చేసి మహానందిశ్వరుడి పట్ల తన భక్తిని చాటుకున్నారు. భూమి, ఇంటిని దేవస్థానికి రిజిస్ట్రేషన్ చేశారు. రాజు కుటుంబం గతంలోనూ ఒక ఎకరం పొలం ఈ దేవస్థానానికి దానం చేయగా, వివాదంలో ఉన్న మరో ఎకరం కూడా వివాద పరిష్కారం అనంతరం దేవస్థానానికి అందిస్తానని ప్రకటించడం విశేషం.

రాజు దాతృత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేవాలయా అభివృద్ధిని కాంక్షిస్తూ భారీ విరాళం అందించిన దాత రాజు,శకుంతల దంపతులను ఈఓ శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించి ఘన సన్మానం చేశారు. 

Tags:    

Similar News