Huge Crocodile పులిచింతల డ్యామ్‌పైకి వచ్చిన భారీ మొసలి.. అధికారుల కీలక ప్రకటన

ఎగువన కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

Update: 2024-10-04 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. డ్యామ్‌లో వరద నీరు గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) డ్యామ్‌లోకి వదిలారు. అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొనడంతో నీటిని విడుదల చేయగా.. పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా తయారైంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్‌లో బ్యాక్ వాటర్ విపరీతంగా పెరిగి అందులోంచి ఓ భారీ మొసలి ఏకంగా డ్యామ్‌పైకి ఎక్కేసింది.

అనంతరం ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ పలువురిని భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న డ్యామ్ సిబ్బంది శ్రమించి మొసలిని ప్రాజెక్ట్‌లోకి వెళ్లేలా చేశారు. ఈ పరిణామంతో నదిలో స్నానాలకు వెళ్లేవారు జాగ్రత్త జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొన్నారు. లేనిపక్షంలో మొసలి దాడి చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. 


Similar News