‘తప్పు చేసిన వారిని ఆ దేవుడు వదలిపెట్టడు’.. మాజీ మంత్రి మాస్ వార్నింగ్

ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-10-04 10:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవుడు వదిలిపెట్టడని సోమిరెడ్డి హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో కచ్చితంగా విచారణ జరగాలని ఆయన కోరుకున్నారు. నెల్లూరు జిల్లాలోని టీడీపీ(TDP) కార్యాలయంలో నేడు(శుక్రవారం) మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులను గత వైసీపీ ప్రభుత్వం(YCP) మోసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని.. అప్పటి అధికారులు వాటిపై ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సూరాయపాలెంలో రూ. 54 కోట్లు, విరువూరులో రూ. 37 కోట్లు పెనాల్టీని మైన్స్ శాఖ వేసిందని గుర్తుచేశారు. అంతేకాదు రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని సోమిరెడ్డి ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News