ఏపీ టెట్ కు భారీగా దరఖాస్తులు
ఏపీలో టెట్ పరీక్షకు 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో టెట్ పరీక్షకు 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆగస్ట్ 3తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా... 4,27,300 మంది దరఖాస్తు చేశారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామారావు వెల్లడించారు. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం ముందుగా టెట్ పరీక్ష నిర్వహిస్తుండగా... జూలై 2న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 3 వరకు విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది.కాగా ఎస్జీటీ విభాగం పేపర్-1ఎకు 1,82,609 అత్యధిక దరఖాస్తులు రాగా, ఎస్జీటీ (ప్రత్యేక విభాగం) పేపర్-1 బికు 2,662 అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో నిర్ణయించిన ప్రకారమే అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, దీనిలో ఎలాంటి మార్పు ఉండదని, అభ్యర్థులంతా ప్రిపేర్ అవ్వాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో టెట్ లో స్కోర్ పెంచుకునేందుకు పోటీపడుతున్న వారి సంఖ్య భారీగా ఉంది.