Tirumala News:తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
ఏపీలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు(floods) అల్లకల్లోలం సృష్టించాయి.
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు(floods) అల్లకల్లోలం సృష్టించాయి. అయితే నిత్యం వేలాది మంది భక్తులతో తిరుమల ఆలయం(TTD) కిటకిటలాడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల(Tirumala)కు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో భక్తుల(Devotees) రద్దీ సాధారణంగా ఉంది. మూడు రోజుల క్రితం వరకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టగా..ప్రజెంట్ 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి 3 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా, 18,697 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం(income) రూ.4.55కోట్లు వచ్చింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనం( free viewing) కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వచ్చే నెల(October) 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 9 వరకు ఘాట్ రోడ్డులో బైకులకు అనుమతి లేదని TTD తెలిపింది.