తెలుసుకుని మాట్లాడండి..మీ మరిది హయాంలో అప్పులను మాపై నెడితే ఎలా?: పురంధేశ్వరికి ఎంపీ భరత్ కౌంటర్
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ కౌంటర్ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వంలోని అప్పులు వైసీపీ పాలనలోని అప్పులను బేరీజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసమే అప్పులు చేయాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు. నిబంధనలకు లోబడే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఈ వాస్తవాలను పురంధేశ్వరి గమనించాలని ఎంపీ మార్గాని భరత్ సూచించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అసెట్ క్రియేట్ చేయలేదని విమర్శించారు. అంతేకాదు రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని దాటిపోయాయని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
Read More : సీఎం పీఠం నీదా? నాదా?: పవన్ కల్యాణ్‌కు పోటీగా మహిళా నేత