‘నా మాతృ భాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నాను’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
విజయవాడ(Vijyawada)లో రెండోరోజు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijyawada)లో రెండోరోజు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పలువురు మంత్రులు పాల్గొని మాతృ భాష గొప్పతనం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి(Health Minister) సత్య కుమార్ యాదవ్(Satya Kumar Yadav) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారని తెలిపారు.
ఈ క్రమంలో ‘నా మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నాను’ అని చెప్పారు. నా పిల్లలకు పెద్ద బాలశిక్ష ఇచ్చి చదవమంటున్నా అన్నారు. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్నీ భాష తోనే ముడిపడి ఉంటాయన్నారు. బాల్యం నుంచే పిల్లలకు మాతృభాష మాధుర్యం అందించాలన్నారు. అది తల్లిదండ్రుల చొరవతోనే మాతృ భాష(mother tongue) సాధ్యపడుతుంది అన్నారు. ఒకప్పుడు మైసూరులో తెలుగు భాష అధ్యయన కేంద్రం ఉండేది. 2020లో ఏపీకి తీసుకుని వచ్చారు. కానీ భవనం కేటాయించడానికి గత వైసీపీ ప్రభుత్వం(YSRCP) కృషి చేయలేదని విమర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ఆయన ట్రస్టుకు చెందిన ఓ భవనాన్ని ఇచ్చారు. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రానికి కూటమి ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది. త్వరలోనే సొంత భవనం అందుబాటులోకి వస్తోందని మంత్రి స్పష్టం చేశారు.