Honey Trap: విశాఖలో హనీ ట్రాప్.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ బాగ్చి

విశాఖలో ఎన్నారై టార్గెట్ గా ఓ యువతి హనీ ట్రాప్ చేసింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇదంతా ఒక ముఠా చేస్తున్నట్లు గుర్తించారు.

Update: 2024-10-06 09:18 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో హనీ ట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఎన్నారై టార్గెట్ గా హనీట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్ స్టా పరిచయం చేసుకుని, మాటలతో కవ్వించి.. ఆపై తన సహచరులతో కలిసి బంధించి బ్లాక్ మెయిల్ చేసిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని, లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించిందని పోలీసులు తెలిపారు.

జాయ్ జెమీమా అనే మహిళ.. యువకులను ట్రాప్ చేస్తుందని సీపీ బాగ్చి వెల్లడించారు. ఒక ముఠా అంతా పథకం ప్రకారమే ప్లాన్ చేస్తోందని, నిందితురాలు జాయ్ జెమీమాకు కూడా శిక్షణ తీసుకుందన్నారు. యువకుల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా మత్తు ప్రయోగించాలి, వీడియోలు తీసి ఎలా బ్లాక్ మెయిల్ చేయాలని ముఠా శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు. అన్ని ఆధారాలను సేకరించి, నిందితులందరినీ అరెస్ట్ చేశాక.. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.


Similar News