Home Minister Anitha: తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలం.. హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై సినీనటి కాదంబరి జత్వానీ (Kadambari Jatwani) కేసు కీలక దశకు చేరకుంటోంది.

Update: 2024-09-26 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై సినీనటి కాదంబరి జత్వానీ (Kadambari Jatwani) కేసు కీలక దశకు చేరకుంటోంది. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌ పంపడంతో పాటు తనను, కుటుంబాన్ని కస్టడీలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారంటూ నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర డీజీపీ ద్వరకా తిరుమల రావు (DGP Dwaraka Tirumala Rao) విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆయన సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

తాజాగా, ఇదే అంశంపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) రియాక్ట్ అయ్యారు. ముంబయి నటి కాదంబరీ జత్వానీ (Kadambari Jatwani) కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసినట్లుగా గుర్తు చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కేసులో మరికొంత మంది పోలీసులను కూడా విచారిస్తున్నారని తెలిపారు. విచారణలో వారు బాధ్యులని తేలితే.. అందులో ఎంత పెద్దవారు ఉన్నా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కేసును సీఎం చంద్రబాబు (CM Chandrababu) కూడా చాలా సీరియస్‌ రివ్యూ చేస్తున్నారని అనిత గుర్తు చేశారు.  


Similar News