పవన్ చొరవతోనే అమరావతికి రైల్వే లైన్ .. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతోనే అమరావతి రైల్వే ‌లైన్‌ నిర్మాణానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ తెలిపారు...

Update: 2024-10-24 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) చొరవతోనే అమరావతి రైల్వే ‌లైన్‌(Amaravati Railway Line) నిర్మాణానికి ప్రధాని మోడీ (Prime Minister Modi)ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్(Union Minister Ashwani Vaishtav) తెలిపారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ(Railway connectivity) ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందని చెప్పారు. మచిలీపట్నం(Machilipatnam), కాకినాడ పోర్టుల(Kakinada Ports)కు ఈ రైల్వే లైన్ అనుసంధానం చేయబడుతుందని తెలిపారు. ఏపీ ప్రజల కలను కేంద్రం అర్ధం చేసుకుందని, రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అశ్వనీ వైష్టవ్ పేర్కొన్నారు.

కాగా అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపీ రాజధాని(AP Capital) అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గంటూరు జిల్లా ఎర్రుపాలెం(Yerrupalem) నుంచి అమరావతి మీదుగా నంబూరు(Nambur) వరకు కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం 57 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు రూ. 2,245 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది. కృష్ణా నది(Krishna river)పై 3.2 కిలో మీటర్ల మేర రైల్వే బ్రిడ్జిను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్రమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు.


Similar News