AP News:ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

Update: 2024-10-24 11:22 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్(AP Government) ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కేబినెట్ భేటీలో కూడా సీఎం చంద్రబాబు(CM Chandrababu) హామీలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి నుంచి ప్రతి ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల(Free gas cylinders)ను ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నిన్న(బుధవారం) జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు సూపర్ సిక్స్(Super Six) హామీల్లో భాగంగా ఈ నెల (అక్టోబర్) 31వ తేదీ నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. ఈ క్రమంలో దానికి 3,4 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయన్నారు. ఈనెల 31 నుంచి 2025 మార్చి నెలాఖరు లోపు ఒక సిలిండర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత 2025 ఏప్రిల్ 1 నుంచి జులై నెలాఖరు వరకు మొదటి గ్యాస్ సిలిండర్, AUG 1 నుంచి NOV చివరి వరకు రెండోది, DEC 1 నుంచి 2026 MAR నెలాఖరు నాటికి మూడో సిలిండర్ ఇస్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లిస్తే 48 గంటల్లో ఖాతాలో ప్రభుత్వం ఆ సొమ్మును జమ చేస్తుందని తెలిపారు.

Tags:    

Similar News